ఆటలంటే.... ఆరోగ్యంతో పాటు ఉత్సాహాన్ని అందించేలా ఉండాలి. ప్రస్తుతం కాలంలో ఆటలకు దూరమై... ఫోన్లల్లో గేమ్స్ ఆటలకు... అలవాటు పడి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. పబ్జీ గేమ్... చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆకర్షిస్తోంది. ఆ గేమ్‌కు బానిసై... మానసికంగా కుంగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.
పిల్లల ప్రాణాలను హరిస్తున్న పబ్జీ గేమ్‌ను కేంద్రప్రభుత్వం వెంటనే బ్యాన్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుత్‌రావు డిమాండ్ చేశారు. రెండురోజుల క్రితం హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన పదో తరగతి విద్యార్థి ఎక్కువ సమయం మొబైల్లో గేమ్స్ ఆడుతున్నాడని తల్లిదండ్రులు మందలించగా... ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.