కరోనా బాధితులకు గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హైదరాబాద్ లోని తెజస కార్యాలయంలో "వైద్య సిబ్బందిని రక్షించుకుందాం-కరోనాను ఎదుర్కొందాం" అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యనిపుణులు పాల్గొని పలు సలహాలు సూచనలు చేశారు.
'గాంధీలో జరుగుతున్న చికిత్సపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి'
హైదరాబాద్ లోని తెజస కార్యాలయంలో "వైద్య సిబ్బందిని రక్షించుకుందాం- కరోనాను ఎదుర్కొందాం" అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైద్యనిపుణులు పాల్గొని పలు సలహాలు సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక గాంధీ ఆసుపత్రిని మాత్రమే కాకుండా... జిల్లాల్లోనూ కరోనా సెంటర్ ఏర్పాటు చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక గాంధీ ఆసుపత్రిని మాత్రమే కరోనా సెంటర్‌గా ఏర్పాటు చేయడం భావ్యం కాదని... జిల్లాల్లోనూ కరోనా సెంటర్ ఏర్పాటు చేయాలని కోదండరాం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలను కరోనా చికిత్స కోసం వినియోగించుకోవాలని సూచించారు.
గచ్చిబౌలిలో ఏర్పాటుచేసిన సెంటర్‌కు బాధితులను ఎందుకు తరలించడం లేదని ప్రశ్నించారు. గచ్చిబౌలి స్టేడియంలో కేవలం పడకలు తప్ప వైద్యులు లేని ఆక్షేపించారు. ప్రభుత్వం ఇకనైనా మేల్కొని వైద్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి... వారి పర్యవేక్షణలోనే వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోదండరాం సూచించారు.