ఏపీలో ప్రజావేదిక భవన కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఇప్పటికే భవనానికి చేరుకున్నారు. ఫర్నీచర్, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్ సామగ్రి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టారు. భవనంలో ఉన్న సామగ్రిని సీఆర్‌డీఏ అధికారులు తరలిస్తున్నారు. అక్కడి పూలకుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి తరలించారు. ఎలాంటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఏపీలో ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం - cm ys jagan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్... ప్రజావేదిక విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు అమలు చేస్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమీక్ష ముగిసిన వెంటనే కూల్చివేత చర్యలను మొదలుపెట్టారు.
ప్రజావేదిక కూల్చివేత