ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీని ప్రజల చేతికి అప్పగిస్తున్నానని ప్రకటిస్తూ ఆవిడను క్షేమంగా చూడాలని వాద్రా కోరారు. విషపూరిత, ప్రతీకారేచ్ఛలతో రగిలిపోతోన్న ప్రస్తుత రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రియాంకకు సూచించారు. భావోద్వేగపూరితమైన తన శుభాకాంక్షలను ఫేస్బుక్లో పంచుకున్నారు వాద్రా. పశ్చిమ యూపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జ్యోతిరాధిత్య సింధియాకు సైతం వాద్రా శుభాకాంక్షలు తెలిపారు.
'ప్రియాంకను జాగ్రత్తగా చూసుకోండి' - ప్రియాంక
ప్రియాంక గాంధీ ఉత్తమ సతీమణి, తల్లి అని ఆవిడ భర్త రాబర్ట్ వాద్రా కితాబిచ్చారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా ఆ ప్రాంతంలో ప్రియాంక పర్యటించిన సందర్భంగా ఆమె భర్త ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రియాంకను జాగ్రత్తగా చూసుకోండి
"శుభాకాంక్షలు ప్రియాంక... నీ ప్రతి ప్రయాణంలోనూ నా సహకారం నీకుంటుంది. నీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించు" - ఫేస్బుక్లో రాబర్ట్ వాద్రా.
ప్రియాంక గాంధీ, వాద్రాలకు 1997లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. హవాలా కుంభకోణంపై గతవారం వరుసగా మూడు రోజులు వాద్రాను ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
Last Updated : Feb 12, 2019, 9:45 AM IST