లేయర్, బ్రాయిలర్ నెక్ జోనల్ కమిటీ ఛైర్మన్ గుర్రం చంద్రశేఖర్‌రెడ్డి రాజీనామా నేపథ్యంలో కొత్త ఛైర్మన్ ఎన్నికపై జరగాల్సిన సమావేశాన్ని అకస్మాత్తుగా వాయిదా వేయటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సాధక బాధకాలు తెలిసిన లేయర్ రైతు ఛైర్మన్‌గా ఉంటేనే తమకు న్యాయం జరుగుతుందని పౌల్ట్రీ రైతులు స్పష్టం చేశారు. బ్రాయిలర్ రైతు ఛైర్మన్‌గా ఉండటం వల్ల వెంకటేశ్వర హ్యేచరీ యాజమాన్యం ఒత్తిళ్ల వల్ల గుడ్డు రేటు పెరగడం లేదని, ఫలితంగా తాము నష్టపోతున్నామని వాపోయారు. వేసవి ఎండలకు తోడు మేత, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం గుడ్డు ధర రూ. 5 ఉంటే తప్ప తమకు గిట్టుబాటుకాదని పేర్కొన్నారు.
సమావేశం వాయిదాపై పౌల్ట్రీ రైతుల ఆగ్రహం - nic
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ - నెక్ ప్రధాన కార్యాలయంలో పౌల్ట్రీ రైతుల సమావేశం వివాదాస్పదంగా మారింది. ఇవాళ జరగాల్సిన నెక్ హైదరాబాద్ జోనల్ కమిటీ సమావేశం వాయిదా వేయడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు.
సమావేశం వాయిదాపై పౌల్ట్రీ రైతుల ఆగ్రహం