సంగారెడ్డి జిల్లాలో పాలిసెట్ పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. అధికారులు 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలోని 9 కేంద్రాల్లో 3,044, జహీరాబాద్లోని 4 కేంద్రాల్లో 854మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. నిమిషం నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు.
సకాలంలో పరీక్షాకేంద్రానికి చేరుకున్న విద్యార్థులు - పాలిసెట్ పరీక్ష
పాలిసెట్ పరీక్ష సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా మెుదలైంది. నిమిషం నిబంధన వల్ల విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. . పరీక్ష రాసే విద్యార్థులతో పాటు వారి తరలిరావటంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
![సకాలంలో పరీక్షాకేంద్రానికి చేరుకున్న విద్యార్థులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3016259-thumbnail-3x2-vysh.jpg)
పాలిసెట్ పరీక్ష