తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నేడు పాలిసెట్​కు అంతా సెట్​...! - నేడు పాలిసెట్​కు అంతా సెట్​...!

పాఠశాలల్లో పరీక్షలైపోయాయి... సెలవులిచ్చారు... కానీ... తర్వాత చదివే కొన్ని కోర్సులకు మాత్రం ప్రవేశ పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటి పెడుతూనే ఉన్నారు. చిన్నారులు మొన్నటి వరకు గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షలు రాయగా... ఇప్పడు పదో తరగతి అనంతరం పాలిటెక్నిక్​లో చేరేందుకు విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

ఒంటి గంట వరకు పరీక్ష

By

Published : Apr 16, 2019, 6:28 AM IST

పాలిటెక్నిక్​ ప్రవేశ పరీక్ష... తెలంగాణ పాలిసెట్​ను మంగళవారం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షా 6వేల 380 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది కంటే సుమారు 19 వేల దరఖాస్తులు తగ్గాయి. రాష్ట్రంలో 320 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఒంటి గంట వరకు పరీక్ష

ABOUT THE AUTHOR

...view details