పోలీసుల నియామకాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను రాష్ట్ర పోలీసు నియామక మండలి విడుదల చేసింది. సివిల్ ఎస్‌ఐ పోస్టులకు 72.41 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 89.91 శాతం మంది అర్హత సాధించినట్లు పోలీస్ నియామక మండలి పేర్కొంది.
పోలీస్ తుదిరాత పరీక్ష ఫలితాలు విడుదల - tslprb
పోలీసు ఉద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వివరాలు వెబ్సైట్లో పొందుపర్చినట్లు పోలీసు నియామక మండలి పేర్కొంది.
పోలీస్ పరీక్ష ఫలితాలు విడుదల
అభ్యర్థులు పొందిన మార్కులను వెబ్సైట్లో పొందుపర్చినట్లు అధికారులు తెలిపారు. రాత పరీక్షలకు సంబంధించిన తుది కీ, ఓఎంఆర్ జవాబు పత్రాలను రేపటి నుంచి వెబ్సైట్లో పొందవచ్చని పోలీస్ నియామక బోర్డు ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే పునర్ మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇవీ చూడండి: తాగుబోతు ఫోన్ కాల్.. థియేటర్ బంద్...
Last Updated : May 26, 2019, 10:03 AM IST