సిరిసిల్లకు చెందిన స్థిరాస్తి వ్యాపారి రాకేశ్‌రెడ్డితో లావాదేవీలు కొనసాగించారని, జయరాం హత్య గురించి తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వలేదని దర్యాప్తులో తేలింది. నేరం గురించి తెలిసినా.. సమాచారమివ్వకపోవడమూ నేరమనే కోణంలో వ్యాపారిని అరెస్ట్ చేయనున్నారు. ఇప్పటికే రాకేశ్‌రెడ్డి, శ్రీనివాస్, నాగేశ్, విశాల్, సూర్యచంద్రారెడ్డిలను రిమాండ్‌కు తరలించారు.
రాకేశ్‌రెడ్డితో పరిచయమా? ఎంతకాలంగా
జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డికి, స్థానిక పోలీసులకు మధ్య సంబంధాలపై విచారణ ముమ్మరం అయింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులకు ప్రశ్నావళిని ఇచ్చి, సమాధానాలివ్వాలని ఆదేశించారు. హత్యకు సహకరించారనే కోణంలో సినీ సహాయ నటుడు సూర్య, అతని స్నేహితుడు కిశోర్‌ను అరెస్ట్‌చేసే అవకాశం ఉంది. సిరిసిల్లకు చెందిన స్థిరాస్తి వ్యాపారిని అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
హత్య అనంతరం రాకేశ్‌రెడ్డి ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాస్, రాంబాబులకు ఫోన్‌చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐలు గోవింద్‌రెడ్డి, హరిశ్చంద్రారెడ్డిలు హత్య కేసుపై సకాలంలో స్పందించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఐదుగురికి ఇదివరకే ఉన్నతాధికారులు ప్రశ్నావళి ఇచ్చారు. రాకేశ్‌రెడ్డితో ఎంతకాలం నుంచి పరిచయం ఉంది... హత్య జరిగిన తర్వాత రాకేశ్‌రెడ్డి ఫోన్చేశారా... ఫోన్లో ఏం చెప్పారు వంటి ప్రశ్నలు ఉన్నాయి. వారి సమాధానాలను నిర్ధరించుకుని చర్యలు తీసుకోనున్నారు.
ఇవీ చూడండి:తీగలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ