తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఎన్జీటీలో పిటిషన్లు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్లను ఈరోజు జాతీయ హరిత ట్రైబ్యునల్​ విచారణ జరిపింది.

తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఎన్జీటీలో పిటిషన్లు

By

Published : May 13, 2019, 4:25 PM IST

తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఎన్జీటీలో పిటిషన్లు

తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగునీటి ప్రాజెక్టు పనులు చేస్తున్నారని హర్షవర్ధన్​ అనే వ్యక్తి జాతీయ హరిత ట్రైబ్యునల్​లో పిటిషన్​ దాఖలు చేశారు. పనులపై కమిటీ వేసి నివేదిక తెప్పించుకోవాలని అభ్యర్థించారు. గతంలో దాఖలైన వ్యాజ్యంతో పాటు దీన్ని విచారిస్తామని ట్రైబ్యునల్ పేర్కొంది. తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది.

తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై హయత్​ ఉద్దీన్​ వేసిన పిటిషన్​పై ఎన్జీటీ నేడు విచారణ జరిపింది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్​ చేస్తూ వ్యాజ్యం దాఖలైంది. ఈరోజు న్యాయవాది హాజరు కాకపోవడం వల్ల విచారణ వాయిదా వేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్​ను కోరారు హయత్ఉద్దీన్. విచారణను ఎన్జీటీ జులై 10కి వాయిదా వేసింది. ​

ఇదీ చూడండి : పదో తరగతి ఫలితాల్లో బాలికల ముందంజ

ABOUT THE AUTHOR

...view details