వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన మాధవన్ హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్నానానికి చెరువుకు వెళ్లి నీళ్లలో మునిగి మరణించారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. స్నేహితులతో హోలీ వేడుకల్లో పాల్గొన్న తర్వాత స్నానానికి మంజీరా జలాశయానికి వెళ్లి లోతు అంచనా వేయలేక సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి పల్లికి చెందిన తుకారం మృత్యువాత పడ్డారు. ఈయనకు నెలరోజుల కిందటే వివాహం అయ్యింది.
నీళ్లే వారిని మృత్యు ఒడికి చేర్చాయి - peoples died in Holi festival in state wide
హోలీ వేళ కొందరి ఇంట ఆనందం నిండగా మరికొందరి ఇంట విషాదం నింపింది. వేడుకల్లో పాల్గొని స్నానానికి వెళ్లి రాష్ట్రంలో ఐదుగురు మృత్యవాత పడ్డారు.
![నీళ్లే వారిని మృత్యు ఒడికి చేర్చాయి](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2761523-90-bf1d8bc4-7c29-4ea5-a4d4-5696aa8e9a4a.jpg)
నీళ్లే వారిని మృత్యు ఒడికి చేర్చాయి
నీళ్లే వారిని మృత్యు ఒడికి చేర్చాయి
వనపర్తి జిల్లా అమరచింతలో నీళ్లలో పడి ఏడో తరగతి విద్యార్థి రవి మరణించాడు. మేడ్చల్ జిల్లా కాచిగాని సింగారంలో ఈతకొలనులో పడి రాజస్థాన్‌కు చెందిన భగవాన్బాయ్ మృతిచెందాడు. కుమురం భీం జిల్లా తటిపల్లి గ్రామం వద్ద ప్రాణహిత నదిలో పడి మహారాష్ట్రకు చెందిన రామగిర్కార్ మారుతి మరణించారు.
Last Updated : Mar 22, 2019, 7:41 AM IST