తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పట్టణాలు, నగరాలు ఖాళీ .. రైళ్లు, బస్సులు కిటకిట - ELCTIONS

ఏప్రిల్​ 11 న జరగనున్న ఓట్ల పండుగకు నగర వాసులు స్వగ్రామాలకు క్యూ కట్టారు. ప్రయాణికుల రద్దీ తట్టుకునేందుకు రైల్వే, ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో రైల్వే, బస్​ స్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు.

పట్టణాలు, నగరాలు ఖాళీ .. రైళ్లు, బస్సులు కిటకిట

By

Published : Apr 8, 2019, 6:02 AM IST

Updated : Apr 8, 2019, 10:25 AM IST

పట్టణాలు, నగరాలు ఖాళీ .. రైళ్లు, బస్సులు కిటకిట

నగరాలు ఖాళీ అవుతున్నాయి.. బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి.. ఇందుకు వేసవి సెలవులు ఒక కారణం ఐతే ఓట్ల పండుగ మరో కారణం.

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఓటర్లందరూ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఆయా తేదీల్లో దాదాపు అన్ని రైళ్లు నిండిపోయాయి. ఏప్రిల్​ 11న గురువారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. శుక్రవారం ఒక్కరోజు సెలవు తీసుకుంటే తర్వాత రెండో శనివారం, ఆదివారం సెలవులు కావడం.. వరుసగా 4 రోజులు రావడం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ ఓట్ల పండగకు పల్లె బాట పడుతున్నారు.

రద్దీని తట్టుకునేందుకు ఆర్టీసీ అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. రైల్వే సైతం ఏప్రిల్​ 9, 10, 11 తేదీల్లో అదనంగా 15 రైళ్లను నడుపుతోంది. అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రయాణికుల అవసరాలకు సరిపోవడం లేదు. అందువల్ల కొంత మంది సొంత వాహనాల్లో వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు.

ఇవీ చూడండి: దిల్లీలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే: హరీశ్​ రావు

Last Updated : Apr 8, 2019, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details