రాష్ట్రంలో భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పగటి పూట బయటకు రావాలంటేనే జంకుతున్నారు. వాయువ్య భారతం నుంచి పొడి గాలులు వీస్తున్నందున శుక్రవారం నుంచి 3 రోజుల పాటు వడగాలుల ఉద్ధృతి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గురువారం అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో 45.2, మేడిపల్లి 45.1, మెట్పల్లిలో 44.9, రామగుండం 43.6, హైదరాబాద్లో 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు.
భానుడి ఉగ్రరూపం... బెంబేలెత్తుతున్న జనం - పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు అధికమవుతున్నాయి. భానుడి ఉగ్ర రూపానికి జనం పగటి పూట బయటకు రాలేకపోతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు