గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణ సంఘం అత్యవసరంగా సమావేశమైంది. ఇటీవల కాలంలో పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రెండు రోజుల కిందట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భాజపాకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకునే దిశలో ముందుకు వెళ్లాలని క్రమశిక్షణా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం భేటీ - congress meetng on komati reddy statements
గాంధీభవన్‌లో పీసీసీ క్రమశిక్షణా సంఘం సమావేశమైంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై క్రమశిక్షణా సంఘం సభ్యులతో కోదండరెడ్డి చర్చించారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం భేటీ
పార్టీకి నష్టం కలిగించేట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదని క్రమశిక్షణా సంఘం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సమావేశమైన క్రమశిక్షణా సంఘం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైనే ప్రధానంగా చర్చిస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
ఇవీ చూడండి: అయినా నేను పార్టీలోనే ఉన్నాను: వీహెచ్