మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించింది. ఇవాళ సాయంత్రం క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డి నేృతృత్వంలో భేటీ అయిన కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. తరచూ పార్టీపై వ్యతిరేకంగా గళం విప్పుతున్న రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టి సూచించినట్లు సమాచారం. ఆ నోటీసులను వారి ముగ్గురికి పంపించి అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు..?
కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణా సంఘం తీవ్రంగా పరిగణించింది. షోకాజ్ నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైంది. కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టిలతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
కోమటిరెడ్డికి షాకాజ్ నోటీసులు..?
Last Updated : Jun 17, 2019, 11:58 PM IST