తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సైనా కోసం రాకెట్​ పట్టిన పరిణీతి - పరిణీతి చోప్రా

బాలీవుడ్​ నటి పరిణీతి చోప్రా త్వరలో మరో బయోపిక్​లో సందడి చేయనుంది. బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో కనిపించనుంది ఈ అమ్మడు.

సైనా - పరిణీతి

By

Published : Oct 8, 2019, 9:06 PM IST

Updated : Oct 9, 2019, 8:09 AM IST

బాలీవుడ్‌ అందాల నటి పరిణీతి చోప్రా... బ్యాడ్మింటన్​ క్రీడాకారిణిగా ప్రేక్షకులను అలరించనుంది. స్టార్​ ప్లేయర్​ సైనా నెహ్వాల్​ బయోపిక్​లో నటిస్తోన్న ఈ భామ... రాకెట్​ పట్టిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

ప్రాక్టీస్​లో చెమట చిందించిన పరిణీతి

అవకాశం చేజారే...

హిందీ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ తొలుత 'సైనా' బయోపిక్‌కు ఎంపికచేశారు. సైనా నెహ్వాల్‌ పాత్ర కోసం...ప్రముఖ బ్యాడ్మింటన్​ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ వద్ద నెల రోజుల పాటు ఆటలో మెళకువలు కూడా నేర్చుకుంది. ఆమె ప్రధానపాత్రలో ప్రీ లుక్‌ను కూడా విడుదల చేసింది చిత్రబృందం. చిత్రీకరణ సమయంలో శ్రద్ధకు డెంగీ జ్వరం సోకడం వల్ల ఆమెను సినిమా నుంచి తప్పించినట్లు వెల్లడించింది చిత్ర నిర్మాణ సంస్థ. అనారోగ్య సమస్యల కారణంగా శ్రద్ధ అనుకున్న తేదీల్లో చిత్రీకరణకు రాలేనని చెప్పడం వల్లే హీరోయిన్​ను మార్చాల్సి వచ్చిందని ప్రకటించారు.

అమోల్‌ సేన్‌ గుప్తా ఈ చిత్రానికి దర్శకుడు. సినిమాను వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటోంది చిత్రబృందం.

ఇదీ చదవండి: మెకానిక్​ 'సీనయ్య'గా వినాయక్​ లుక్​..!

Last Updated : Oct 9, 2019, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details