సరిహద్దు వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి దుశ్చర్యకు పాల్పడింది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్... సైనిక శిబిరాలు, గ్రామాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడింది. పాక్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది భారత సైన్యం.
పాక్ దుశ్చర్య... సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులు
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి దాడికి దిగింది. దాయాది దుశ్చర్యలకు భారత్ దీటుగా సమాధానమిచ్చింది.
పాక్ దుశ్చర్య... సరిహద్దు గ్రామాలే లక్ష్యంగా కాల్పులు
బాలాకోట్, మెందార్ ప్రాంతాల్లో జరిపిన కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని భారత అధికారులు వెల్లడించారు.
కుప్వారా జిల్లాలోని టాంగ్ధర్ సెక్టార్‌లోనూ ఈరోజు తెల్లవారుజామున పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ దాడికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు.