తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'బర్త్ డే బంప్స్ పేరిట వెర్రి వేషాలు'

బర్త్ డే వచ్చిదంటే చాలు రాత్రుళ్లు కేకులు కోయడం, స్ర్పేలు, మందులు చల్లుకుంటూ వెర్రి వేషాలు వేయడం. ఇది చాలదన్నట్లు బర్త్ డే బంప్స్ పేరిట ఇష్టమొచ్చినట్లుగా చావగొట్టడం ఇటీవల కాలంలో ఎక్కువైంది.

By

Published : May 3, 2019, 1:25 PM IST

Updated : May 3, 2019, 2:38 PM IST

'బర్త్ డే బంబ్స్ పేరిట వెర్రి వేషాలు'

'బర్త్ డే బంబ్స్ పేరిట వెర్రి వేషాలు'

బర్త్ డే బంప్స్ అని ఈ మధ్య వెర్రి వేషాలు ఎక్కువయ్యాయి. పై వీడియోలో ఉన్న అబ్బాయిని పుట్టినరోజున కొడితే, ఆతనికి రెండోరోజు నుంచి కడుపునొప్పి ప్రారంభమైంది. తరువాత ఇన్వెస్టిగేషన్​లో పాంక్రియాస్ పూర్తిగా పాడైందని, పక్కటెముకల కండరాలు దెబ్బతిన్నాయని తెలియడంతో ఆపరేషన్ చేశారు. అయినా కూడా లాభం లేకపోయింది. చివరకు ఆ అబ్బాయి చనిపోయాడు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతోంది.

తల్లిదండ్రులారా జాగ్రత్త..!

బర్త్ డే పార్టీల పేరిట యువత రోజుకో కొత్తదనాన్ని తీసుకురావాలనుకుంటుంది. కానీ అవి బెడిసికొట్టి ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. అందుకే మీ పిల్లలు బర్త్ డే పార్టీలు చేసుకునేటప్పుడు కాస్త గమనిస్తూ ఉండండి. ఎలాంటి ప్రమాదాలు జరగుకుండా ఉండేలా చర్యలు తీసుకోండి. బర్త్ డే బంబ్స్​కు దూరంగా ఉంచండి.

ఇవీ చదవండి: వీవీప్యాట్​ రసీదుల లెక్కపై వచ్చేవారం విచారణ

Last Updated : May 3, 2019, 2:38 PM IST

ABOUT THE AUTHOR

...view details