తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరా కొనసాగింపు! - suspend fuel supplies to Air India

ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరాను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి దేశీయ ఇంధన సరఫరా సంస్థలు. గత బకాయిలతో పాటు.. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తామని ఎయిర్​ ఇండియా లిఖిత పూర్వక హామీ ఇచ్చిన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరా కొనసాగింపు

By

Published : Oct 18, 2019, 11:11 AM IST

విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేయాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి దేశీయ ఇంధన రిటైల్​ సంస్థలు. బిల్లులను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ఎయిర్​ ఇండియా హామీ ఇవ్వడమే ఇందుకు కారణం.

లిఖిత పూర్వక వినతితో..

కొద్ది కాలంగా పేరుకుపోయిన రూ.5వేల కోట్ల బకాయిలతో పాటు.. ఎప్పటికప్పుడు ఇంధన బిల్లులు చెల్లిస్తామని ఎయిర్​ ఇండియా లిఖిత పూర్వక హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విమాన సంస్థ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

చెల్లింపుల్లో ఆలస్యంతో..

ఇంధన బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల దేశీయ ఇంధన సరఫరా సంస్థలు ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ (ఐఓసీ), హిందుస్తాన్​ పెట్రోలియం కార్పొరేషన్​ (హెచ్​పీసీఎల్​), భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ (బీపీసీఎల్​) ఎయిర్​ ఇండియాకు హెచ్చరికలు చేశాయి. దేశంలోని ఆరు ప్రధాన విమానాశ్రయాల పరిధిలో విమానాల ఇంధనం (ఏటీఎఫ్​) సరఫరాను నిలిపివేస్తామని ఈనెల ప్రారంభంలో ప్రకటించాయి.

ఇదీ చూడండి: ట్రంప్​ గోల్ఫ్​ క్లబ్​లో 2020 జీ-7 సదస్సు!

ABOUT THE AUTHOR

...view details