తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రేపు ఈడీ కస్టడీలోకి నౌహీరా షేక్

బంగారం పేరిట పెట్టబడులు పెడితే అధిక లాభాలిస్తామని మదుపర్ల వద్ద వేల కోట్లు కాజేసిన నౌహీరా షేక్​ను రేపు ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది. కేసు పురోగతి కోసం వారం రోజుల కస్టడీకి ఈడీ నాంపల్లి కోర్టును అనుమతి అడగ్గా న్యాయస్థానం అంగీకరించింది. పలు కారణాలతో ఈరోజు ఆలస్యమవడం వల్ల రేపు చంచల్​గూడ జైలు నుంచి నౌహీరాను ఈడీ కస్టడీలోకి తీసుకోనుంది.

నౌహీరా షేక్​కు వారం రోజుల కస్టడీ...

By

Published : May 14, 2019, 12:17 PM IST

Updated : May 14, 2019, 9:16 PM IST

రేపు ఈడీ కస్టడీలోకి నౌహీరా షేక్

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే సంచలనం సృష్టించింది హీరా కుంభకోణం. హీరా గోల్డ్​ వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్​ బంగారం పేరిట పెట్టుబడులను స్వీకరించి మదుపరులకు డబ్బుచెల్లించకుండా మోసానికి పాల్పడింది. ఈ కేసులో భాగంగా... నాంపల్లి కోర్టు నౌహీరాకు వారం రోజుల కస్టడీ విధించింది. చంచల్​గూడ జైలు నుంచి ఈడీ ఆమెను రేపు కస్టడీకి తీసుకోనుంది.

ఆరు వేల కోట్ల ఎగవేత

ఇప్పటికే నౌహీరాపై తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు పోలీసులు జరిపిన సోదాల్లో లభించిన కీలక పత్రాలు, హార్డ్​ డిస్క్​ల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టనుంది. సుమారు లక్షన్నర మంది మదుపర్ల నుంచి 6వేల కోట్ల రూపాయలు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.

అమెరికా, దుబాయి నుంచి పెట్టుబడులు

నిబంధనలకు విరుద్ధంగా అమెరికా, దుబాయి నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు గతంలో సీసీఎస్ దర్యాప్తులో తేలింది. నగదు ఎవరి దగ్గర నుంచి వచ్చింది... అది ఏమైంది..? అనే అంశాలపై ఈడీ దర్యాప్తు చేయనుంది.

ఇదీ చూడండి : ముగిసిన తుది విడత పరిషత్​ పోలింగ్

Last Updated : May 14, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details