హీరా గ్రూప్ సంస్థ వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్ ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు మళ్లించారనే ఆరోపణలపై నౌహీరా షేక్ ఆమె అనుచరులు మౌలీ థామస్, బిజూ థామస్‌లను ఈడీ అధికారులు ఏడు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈరోజుతో గడువు ముగియగా... చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఎక్కువ వడ్డీ ఆశ చూపి
నౌహీరా షేక్ ఎక్కువ వడ్డీ ఆశ చూపి భారీ ఎత్తున డిపాజిట్లు స్వీకరించారనే ఆరోపణలపై నౌహీరా షేక్‌ను విచారించారు. లక్షకు పైగా డిపాజిటర్ల నుంచి సుమారు 6వేల కోట్ల పెట్టుబడులు స్వీకరించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.