తెలంగాణ

telangana

ETV Bharat / briefs

అచ్చెన్నను కలిసేందుకు చంద్రబాబుకు అనుమతి నిరాకరణ - అచ్చెన్నాయుడు అరెస్టు వార్తలు

ఈఎస్​ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఏపీ తెదేపా నేత అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు చేసుకున్న అభ్యర్థనలను జైళ్ల శాఖ అధికారులు తిరస్కరించారు.

అచ్చెన్నను కలిసేందుకు చంద్రబాబును అనుమతించని అధికారులు
అచ్చెన్నను కలిసేందుకు చంద్రబాబును అనుమతించని అధికారులు

By

Published : Jun 13, 2020, 5:25 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు.. అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు అమరావతి బయల్దేరారు. ఏపీలోని గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాలని చంద్రబాబు భావించారు. అయితే గుంటూరు వెళ్లేందుకు చంద్రబాబు, లోకేశ్‌కు జైళ్లశాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని అధికారులు తెలిపారు. గత రెండు నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వట్లేదని పేర్కొంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. చంద్రబాబు మరో వినతిపై స్పందించిన జీజీహెచ్ సూపరింటెండెంట్... మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details