సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తెదేపాకు ఊహించని గట్టిదెబ్బ తగిలింది. తెదేపా రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహనరావు, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్ ఆ పార్టీ నుంచి వీడిపోతున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. తమను ప్రత్యేక గ్రూప్‌గా పరిగణించాలని లేఖలో పేర్కొన్నారు.
నలుగురు రాజ్యసభ ఎంపీలు తెదేపాకు గుడ్ బై! - sujana chowdary
తెలుగుదేశం పార్టీ నుంచి వీడిపోతున్నట్లు నలుగురు తెదేపా ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు.
నలుగురు రాజ్యసభ ఎంపీలు తెదేపాకు గుడ్ బై!
రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నారన్న వార్తలపై చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించారు. పార్టీ సీనియర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ఆంధ్ర ప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే భాజపాతో పోరాడామన్న చంద్రబాబు... పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని పేర్కొన్నారు. నేతలు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్న తెదేపా అధినేత... భాజపా చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఇదీ చదవండీ...'భవిష్యత్ కార్యాచరణ'పై.. తెదేపా నేతల భేటీ!