దేశ విభజన సమయంలో లండన్‌లోని ఓ బ్యాంకులో హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 3.5 కోట్ల పౌండ్లను దాచాడు. ప్రస్తుతం దాని విలువ 300 కోట్లు. భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న న్యాయవివాదం బ్రిటన్ హైకోర్టులో కీలక దశకు చేరుకుంది. కొన్ని వారాల్లో తీర్పు రాబోతోంది.
నిజాం వారసులకే దక్కనుందా?
లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్ పీఎల్‌సీలో ఈ నిధులు ఉన్నాయి. 1948లో హైదరాబాద్ నిజాం నుంచి పాకిస్థాన్‌లోని బ్రిటన్ హై కమిషనర్‌కు 1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్‌లు బదిలీ అయ్యాయి. ఆనాడు పాక్‌లో చేరాలా..? లేక భారత్‌తో కొనసాగాలా..? అనే సంశయంలో నిజాం రాజు ఉన్నారు. ఆ తర్వాత తన నిధులను తిరిగివ్వాలని ఆయన కోరినట్లు వార్తలు వచ్చాయి. ఆ సొమ్ము పెరుగుతూ 3.5 కోట్ల పౌండ్లకు చేరింది. ఈ డబ్బు తమకే చెందుతుందని నిజాం వారసులు వాదిస్తుండగా.. దీనికి భారత్ మద్దతు పలుకుతోంది.