చక్కని ఆహార్యాభినయంతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్న హీరోయిన్ నివేదా థామస్. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమాలో డార్గింగ్కు సోదరి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇటీవలే నాగ్ అశ్విన్ నివేదాను కలిసి తన పాత్రను వివరించగా.. ఆమెకు విపరీతంగా నచ్చిందట. త్వరలోనే దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్‌కు చెల్లిగా నివేదా థామస్! - నాగ్ అశ్విన్ నివేదా థామస్
దర్శకుడు నాగ్ అశ్విన్, హీరో ప్రభాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో డార్లింగ్‌కు సోదరిగా నివేదా థామస్ నటించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలో ప్రభాస్ 21వ చిత్రం ఖరారైనట్లు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. పాన్ ఇండియా సినిమాగా రూపొదించనున్నట్లు స్పష్టం చేసింది.సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ఈ సినిమాలో డార్లింగ్ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాతే నాగ్ అశ్విన్‌తో చిత్రం పట్టాలెక్కనుంది. కాగా నివేదా.. నాని 'వి' సినిమాతో సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చూడండి'ఆదిపురుష్' గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చా!