తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నిన్న రాహుల్...నేడు సోనియా - rahul gandhi

కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీపై కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా గడ్కరీని యూపీఏ చైర్​​పర్సన్​ సోనియా గాంధీ ప్రశంసించారు.

నితిన్​ గడ్కరీ

By

Published : Feb 7, 2019, 5:40 PM IST

కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్​ గడ్కరీ.. యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీ నుంచే కాక పలువురు కాంగ్రెస్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో దేశంలో ఇప్పటి వరకు చేపట్టిన పనులు, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులపై గడ్కరీ ప్రసంగించారు.

గడ్కరీ ప్రసంగం ముగింపులో భాజపా సభ్యులు బల్లలు చరుస్తూ అభినందనలు తెలిపారు. గడ్కరీ ప్రసంగాన్ని ఓపికగా వింటూ చిరునవ్వులు చిందించారు సోనియాగాంధీ. బల్లపై చరుస్తూ అభినందించారు. ఆమెతో పాటుగా కాంగ్రెస్ ఎంపీలూ గడ్కరీని ప్రశంసించటం ప్రారంభించారు.

తన నియోజకవర్గంలో పనుల కోసం అడిగిన వెంటనే స్పందించినందుకు గత ఏడాది ఆగస్టులో గడ్కరీకి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు సోనియా.

రాహుల్ పొగడ్తలు...

భాజపా పార్టీ మొత్తంలో ధైర్యమున్న నాయకులు గడ్కరీ మాత్రమేనని రాహుల్ కితాబిచ్చారు. రఫేల్ వివాదం, వ్యవస్థల నిర్వీర్యం పట్ల గడ్కరీ మాట్లాడాలని రాహుల్ కొద్ది రోజుల క్రితం కోరారు.

ABOUT THE AUTHOR

...view details