హాజీపూర్ గ్రామంలో వరుస హత్యల ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. భువనగిరి ప్రధాన ప్రథమ శ్రేణి న్యాయస్థానం నిందితునికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతనిని భారీ భద్రత మధ్య వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
వరంగల్ జైలుకు సీరియల్ కిల్లర్ శ్రీనివాస రెడ్డి - nindithuduremand
సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డికి కోర్టు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అతడ్ని వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు. ఇద్దరు మైనర్లు, ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో అతడిని త్వరలో పోలీసులు కస్టడీకి కోరే అవకాశముంది.
కారాగారానికి క్రూరుడు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను హత్యచేసి బావిలో పూడ్చిపెట్టిన కిరాతక చర్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి అత్యాచారం చేసి అనంతరం హత్యచేసి వారిని బావిలో పూడ్చిపెట్టాడు. ఈ కేసులో నిందితుడికి మరణదండన పడేలా చూస్తామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: మానవ మృగాడిని పట్టుకున్న పోలీసులు
Last Updated : May 1, 2019, 10:34 PM IST
TAGGED:
nindithuduremand