తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఓ వైపు హాస్యం.. మరో వైపు భావోద్వేగం - విడుదలైన సూర్యకాంతం సినిమా ట్రైలర్

మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్​గా నటించిన 'సూర్యకాంతం' ట్రైలర్ విడుదలైంది. తన లుక్స్​తో అభిమానులను ఆకట్టుకుంటోంది భామ.

విడుదలైన సూర్యకాంతం సినిమా ట్రైలర్

By

Published : Mar 26, 2019, 7:46 PM IST

నిహారిక కొణిదెల కథానాయికగా నటించిన 'సూర్యకాంతం' సినిమా ట్రైలర్ విడుదలైంది. టాలీవుడ్ హీరో రానా దీన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడు. రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించాడు. పెర్లెన్ భేసానియా మరో హీరోయిన్​గా నటించింది.

ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్ మెగా అభిమానులను అలరిస్తోంది. లుక్స్​తోనే కాకుండా నటనతో ఆకట్టుకున్న నిహారిక... చిత్రంపై అంచనాల్ని పెంచేస్తోంది.

'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్న కూచి' వెబ్ సిరీస్​లతో మెప్పించిన ప్రణీత్ బ్రహ్మండపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ట్రై యాంగిల్ లవ్​స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details