తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సిగ్నల్ పడిందా... హమ్మయ్య సేదతీరొచ్చు! - traffic

మండుటెండలో ట్రాఫిక్​లో సిగ్నల్ పడితే విసుక్కుంటాం. కానీ అక్కడ ఆ పరిస్థితి లేదు. సిగ్నల్ వద్ద ఎండ తగలకుండా గ్రీన్​టెంట్ ఏర్పాటు చేసి వాహనదారులకు ఉపశమనం కల్పిస్తున్నారు.

హమ్మయ్య సేదతీరొచ్చు

By

Published : Apr 18, 2019, 7:07 PM IST

అసలే ఎండాకాలం బండిపై బయటకెళ్తే ఒకటే ఉక్కుపోత. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పరిస్థితి మరీ దారుణం. అన్నీ వాహనాలు ఓకే దగ్గర ఆగడం వల్ల ఇంజిన్ల వేడి, భానుడి మంట వీటిని తట్టుకోవాలంటే మరీ కష్టం. ఈ పరిస్థితిని పోగట్టాలనుకున్నారు సిద్దిపేట నాలుగో వార్డు కౌన్సిలర్. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీశ్ రావు సూచనతో కౌన్సిలర్ దీప్తి నాగరాజు చల్లటి నీడను ఏర్పాటు చేశారు. 30 అడుగుల పొడవు, 70 అడుగుల వెడల్పుతో చలువ పందిరిని పాత బస్టాండు సమీపంలో గల ఓ కూడలి వద్ద అమర్చారు. సిగ్నల్ పడినంత సేపు వాహనదారులు ఆ నీడన సేద తీరుతున్నారు. హరీశ్​రావు ఆదేశాల మేరకు సిగ్నల్ వద్ద వాహనదారులకు ఎండలో ఇబ్బంది పడొద్దని ఆలోచించి ఈ పని చేసినట్లు కౌన్సిలర్ వెల్లడించారు.

వాహనదారులకు ఉపశమనం

ABOUT THE AUTHOR

...view details