తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు - NHRC NOTICE TO TELANGANA GOVERNMENT

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. 4 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

NHRC

By

Published : Apr 26, 2019, 9:59 PM IST

Updated : Apr 27, 2019, 2:18 AM IST

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు

రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌కు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు ఇచ్చింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. పొరపాట్లు జరిగి ఉంటే పరిష్కారానికి తీసుకున్న చర్యలపై వివరాలు తెలపాలని పేర్కొంది. 4 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రస్తావించింది. మీడియా కథనాలు నిజమైతే ఇది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని తెలిపింది. గ్లోబరీనాకు సామర్థ్యం లేకున్నా ఫలితాల బాధ్యత ఇచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ... విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించింది.

ఇదీ చూడండి: పల్లె విద్యార్థులకు బాసటగా బాసర ట్రిపుల్ ఐటీ

Last Updated : Apr 27, 2019, 2:18 AM IST

ABOUT THE AUTHOR

...view details