తెలంగాణ

telangana

ETV Bharat / briefs

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ ఆర్​.ఎస్.​ చౌహాన్​ - telamgana high court

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్​ను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసింది.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

By

Published : Jun 19, 2019, 11:22 PM IST

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ రాఘవేంద్ర సింగ్​ చౌహాన్​ నియమితులయ్యారు. కొలీజియం సిఫార్సులను కేంద్రం ఆమోదించినందున రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... 2005 జూన్ 13న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తర్వాత 2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. బదిలీపై గతేడాది నవంబరు 23న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కోల్​కతా హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత మార్చి 28 నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ABOUT THE AUTHOR

...view details