ఎర్రమంజిల్లో ప్రస్తుతం జలసౌధ భవన సముదాయాలు ఉన్న ప్రాంతంలో నూతన అసెంబ్లీ, మండలి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఈ భవనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆరో నిజాం హయంలో పోలీస్, న్యాయ శాఖల మంత్రి, నిజాం ప్రియ మిత్రుడు నవాబ్ ఫక్రూల్ ముల్క్ బహద్దూర్ ఎర్రమంజిల్లోని భవనాన్ని నిర్మించారు. 2000 సంవత్సరంలో కొత్త భవనాన్ని నిర్మించి అందులో జలసౌధ భవనంగా నామకరణం చేశారు. అప్పటి నుంచి అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తమ మనోభావాల్ని పంచుకున్నారు. నీటి పారుదల ఉద్యోగుల మనోగతం, నూతన అసెంబ్లీ, మండలి నిర్మాణాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.
చారిత్రక భవన సముదాయంలో నూతన అసెంబ్లీ..!
ఈనెల 27న ఎర్రమంజిల్లో నూతన శాసనసభ, మండలి భవనాల నిర్మాణాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.100కోట్లను కేటాయించింది. వీటి నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
చారిత్రక భవన సముదాయంలో నూతన అసెంబ్లీ..!