తెలంగాణ

telangana

ETV Bharat / briefs

హైదరాబాద్​లో 300 విపత్తు నిర్వహణ బృందాలు - కమిషనర్ దానకిషోర్

హైదరాబాద్​లోని జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ దానకిశోర్ అధ్యక్షతన వర్షాకాల విపత్తు నిర్వహణ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

విపత్తు నిర్వహణ బృందాలు

By

Published : Jun 11, 2019, 5:13 PM IST

వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్​లో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనేందుకు 300 అత్యవసర బృందాలు ఏర్పాటు చేసినట్లు జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ సంచాలకులు విశ్వజిత్ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా... వీరు స్పందిస్తారని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ దానకిశోర్ అధ్యక్షతన వర్షాకాల విపత్తుల నివారణ ప్రణాళిక సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి మెట్రోరైల్ ఎండీ ఎంవీఎస్ రెడ్డి, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి, విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్, పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, వాతావరణ, జలమండలి, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటి వరకు గ్రేటర్​లో 600 శిథిల భవనాలను కూలగొట్టామని... గుర్తించిన మరికొన్ని శిథిల భవన యాజమానులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు నగరంలో ఫ్లెక్సీ హోర్డింగ్స్ నిషేధించినట్లు విశ్వజిత్ వెల్లడించారు.

హైదరాబాద్​లో 300 విపత్తు నిర్వహణ బృందాలు

ఇవీ చూడండి: స్పీకర్, మండలి ఛైర్మన్​కు హైకోర్టు నోటీసులు

ABOUT THE AUTHOR

...view details