తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ధనుష్ సినిమాలో 'అరవింద సమేత' విలన్ - అరవింద సమేతలో నవీన్ చంద్ర

హీరోగా, సహాయ నటుడిగా తెలుగువారికి సుపరిచితమైన నవీన్​ చంద్ర.. తమిళంలో ధనుష్​తో కలిసి నటించనున్నాడు.

తమిళ నటుడు ధనుష్ సినిమాలో కీలక పాత్రలో నటించనున్న నవీన్ చంద్ర

By

Published : Mar 29, 2019, 3:22 PM IST

Updated : Mar 29, 2019, 3:28 PM IST

టాలీవుడ్​లో హీరోగా అలరించిన నవీన్ చంద్ర.. 'అరవింద సమేత' సినిమాలో విలన్​గానూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కోలీవుడ్​లో ధనుష్​తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. దురై సెంథిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడీ 'అందాల రాక్షసి' నటుడు.

సత్యజ్యోతి ఫిలింస్​ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ మెర్విన్‌ సంగీతం అందిస్తున్నారు.

అందాల రాక్షసి సినిమాతో హీరోగా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్​. కథానాయకుడిగా నటిస్తూనే సహాయ పాత్రల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇంతకు ముందే కొన్ని తమిళ సినిమాల్లో కనిపించిన నవీన్... మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 29, 2019, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details