శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎన్నికకు నామినేషన్ల పర్వం ముగిసింది. తెరాస నేత కె.నవీన్ రావు ఒక్కరే నామపత్రాలు దాఖలు చేసినందున... ఆయన ఎన్నిక లాంఛనంగా ప్రకటించడమే మిగిలింది. తెరాస నుంచి నవీన్ రావు బరిలో ఉండగా... విపక్షాలు పోటీకి విముఖత చూపాయి.
మైనంపల్లి రాజీనామాతో ఖాళీ
ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు శాసనమండలికి రాజీనామా చేయడం వల్ల... ఆ స్థానానికి ఎన్నికల ప్రక్రియ చేపట్టారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు నవీన్ రావు రెండు సెట్ల నామపత్రాలు సమర్పించారు.