ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ బుధవారం ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని ఎగ్జిబిషన్ మైదానంలో ప్రమాణ స్వీకార మహోత్సవం లాంఛనంగా జరిగింది. ముఖ్యమంత్రితో పాటు 21 మంది మంత్రులు ప్రమాణం చేశారు. నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో ఈసారి 10 మంది కొత్తవారికి చోటు లభించింది.
ఈ వేడుకకు ముఖ్యమంత్రి సోదరి, ప్రముఖ రచయిత్ర గీతా మెహ్త, సోదరుడు ప్రేమ్ పట్నాయక్ హాజరయ్యారు. 7 వేల మంది ఉన్నతాధికారులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో నవీన్ పట్నాయక్ చేత స్వీకారం చేయించారు ఒడిశా గవర్నర్ గణేశి లాల్. ఐదోసారి ముఖ్యమంత్రి బాధ్యలు చేపట్టిన పట్నాయక్ బహిరంగంగా ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి.