తెలంగాణ

telangana

ETV Bharat / briefs

జనసంద్రంలా త్రివేణి సంగమం

కుంభమేళాలో వసంత పంచమి సందర్భంగా చివరిదైన మూడో షాహీ స్నానాలకు భారీగా భక్తులు తరలివచ్చారు.

జనసంద్రంలా త్రివేణి సంగమం

By

Published : Feb 10, 2019, 11:36 AM IST

Updated : Feb 10, 2019, 1:58 PM IST

జనసంద్రంలా త్రివేణి సంగమం
ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లో జరుగుతున్న కుంభమేళాకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద భక్తుల తాకిడి ఎక్కవగా ఉంది. వసంత పంచమి సందర్భంగా మూడో షాహీ స్నానాలు ఆచరిస్తే పుణ్యం వస్తుందనేది వారి నమ్మకం.

'హర హర గంగే', 'జై గంగా మయ' అంటూ భక్తుల శరణు ఘోషతో ప్రయాగ్​రాజ్​ భక్తి పారవశ్యంతో నిండిపోయింది. సుర్యోదయం లోపే సుమారు 50 లక్షల మంది పుణ్య స్నానాలు చేసినట్లు కుంభమేళా అధికారి విజయ్​ కిరణ్​ తెలిపారు.

జనవరి 15న మకర సంక్రాంతితో ప్రారంభమైన కుంభమేళా మార్చి 4న మహా శివరాత్రితో ముగుస్తుంది.

ఇప్పటి వరకు జనవరి 15 మకర సంక్రాంతి, ఫిబ్రవరి 4 మౌని అమవాస్య రోజున రెండు షాహీ స్నానాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం వసంత పంచమి రోజున చివరిదైన మూడో షాహీ స్నానాలు ఆచరించారు.

ఇప్పటి వరకు సుమారు 14.94 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

Last Updated : Feb 10, 2019, 1:58 PM IST

ABOUT THE AUTHOR

...view details