13 ఏళ్ల బాలిక.. మూడేళ్ల క్రితం ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో కనిపించింది. ఆ అమ్మాయికి గతం గుర్తులేదు. మూడు సంవత్సరాల తరవాత ఇప్పుడు అన్ని విషయాలను చెబుతోంది. బాలీవుడ్ సినిమాలా ఉన్నా... ఈ సంఘటన నిజంగానే జరిగింది.
2016లో ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలోని రాలగాడ ప్రాంతంలో ఒంటరిగా తిరుగుతున్న 13ఏళ్ల బాలికను పోలీసులు గుర్తించారు. అప్పుడా బాలికకుగతం గుర్తుకు లేదు. తన స్వస్థలం, పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. దీంతో పోలీసులు ఆమెను కొరాపుట్ పిల్లల సంరక్షణ కమిటీ(సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. అప్పటి నుంచి మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో చికిత్స అందిస్తున్నారు.