తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఉస్మానియాలో సంగీత వాద్య సమ్మేళనం - book release

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మూలధ్వని పుస్తకాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్. చౌహాన్ ఆవిష్కరించారు.

సంగీత వాద్య సమ్మేళనం

By

Published : Mar 17, 2019, 5:44 PM IST

Updated : Mar 17, 2019, 7:57 PM IST

సంగీత వాద్య సమ్మేళనం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్​ ఆడిటోరియంలో జానపద గిరిజన సంగీత వాద్య సమ్మేళనం అలరిస్తోంది. ఈ కార్యక్రమం రేపటి వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంగీత కళాకారులను ప్రోత్సహిస్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్. చౌహాన్ కొనియాడారు.

మూలధ్వని కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆచార్య జయధీర్ తిరుమలరావు రచించిన మూలధ్వని పుస్తకాన్ని గిరిజన, జానపద వాద్యకారులతో కలిసి ఆవిష్కరించారు.

అభినందనలు...

అంతరించిపోతున్న గిరిజన, జానపద వాద్య సంగీతానికి తెలంగాణ రచయితల సంఘం చేస్తున్న కృషిని జస్టిస్​ అభినందించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కళాకారులు పెద్దసంఖ్యలో ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన, జానపద సంగీతానికి సంబంధించిన 160 మంది వాద్యకారులు 15 నిమిషాలపాటు ఒకేసారి 55 వాయిద్యాలతో సంగీతాన్ని వినిపించడం మూలధ్వనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవీ చూడండి:'కేసీఆర్​కు ఓటేస్తే మోదీకి వేసినట్లే'

Last Updated : Mar 17, 2019, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details