దేశద్రోహం కేసులో తనకు మరణశిక్ష విధించడంపై తొలిసారి స్పందించారు పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్. వ్యక్తగత కక్షతోనే తనకు ఈ శిక్ష పడేలా చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ముషారఫ్ పార్టీ వీడియో విడుదల చేసింది. న్యాయస్థానంలో తాను గానీ, తన తరఫు న్యాయవాదివి గానీ వాదనలు వినకుండా శిక్ష ఖరారు చేశారని ముషారఫ్ చెప్పారు. ఇలా జరిగిన సందర్భాలు గతంలో లేవన్నారు. రాజ్యాంగబద్ధంగా ఈ కేసు విచారణ జరపాల్సిన అవసరం లేదని.. కొంతమంది కావాలనే తనకు శిక్షపడేలా చేశారని ఆరోపించారు పాక్ మాజీ సైన్యాధిపతి.
వ్యక్తిగత కక్షతోనే మరణ శిక్ష: ముషారఫ్ - musharaf death penalty news
వ్యక్తిగత కక్షతోనే దేశద్రోహం కేసులో తనకు మరణశిక్ష విధించారని పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. ఆయనకు మద్దతుగా పాక్‌లోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు.
వ్యక్తిగత కక్షతోనే ఉరిశిక్ష
ముషారఫ్‌కు పాక్‌లోని ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు మద్దతుగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు ఆ దేశ ప్రజలు.
ఇదీ చూడండి: ఫొటోలు తీసినందుకు నెలకు రూ.26 లక్షల జీతం
Last Updated : Dec 19, 2019, 11:36 AM IST