పంజాబ్ కింగ్స్ ఎలెవెన్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ముంబయి ఇండియన్స్. మొహాలీ వేదికగా మ్యాచ్ జరుగుతోంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబయికి ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 5 ఓవర్లలో 51 భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ శర్మ 19 బంతుల్లో 32 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డికాక్ 60 పరుగులతో రాణించాడు.
డికాక్ ఒంటరి పోరాటం
మరో ఎండ్‌లో ఉన్న డికాక్‌కు మిగతా వారి నుంచి పెద్దగా సహకారం లభించలేదు. అయినా చెలరేగి ఆడిన ఈ ఓపెనర్ 60 పరుగులు చేసి ఔటయ్యాడు. ఐపీఎల్లో 1000 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడీ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్.