ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 32 జిల్లాల్లో 5,817 ఎంపీటీసీ స్థానాలకు గానూ తెరాస 3,548 స్థానాలను గెలుచుకొంది. కాంగ్రెస్ అభ్యర్థులు 1,392 చోట్ల విజయం సాధించారు. భాజపా అభ్యర్థులు 208 స్థానాల్లో, స్వతంత్రులు 549 మంది గెలుపొందారు. సీపీఎం 40, సీపీఐ 38, తెలుగుదేశం 21 స్థానాలను గెలుచుకున్నాయి. మరో 20 చోట్ల ఇతర పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు.
స్థానిక పోరులో ఎవరికెన్ని సీట్లంటే...! - mptc elections
స్థానిక సంస్థల ఎన్నికల తుది ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అత్యధికంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను తెరాస కైవసం చేసుకుంది.
mptc, zptc results
మొత్తం 538 జడ్పీటీసీలకు గానూ తెరాస ఏకంగా 449 చోట్ల గెలుపొందింది. కాంగ్రెస్ 75 చోట్ల, భాజపా 8 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు నాలుగు చోట్ల, ఇతర పార్టీల అభ్యర్థులు రెండు చోట్ల గెలుపొందారు.
ఇదీ చూడండి: శాసనసభ సభ్యత్వానికి ఉత్తమ్‌కుమార్ రాజీనామా
Last Updated : Jun 5, 2019, 8:50 PM IST