పలు చోట్లు వాయిదాలు... ఉద్రిక్తల నడుమ ఎంపీపీ ఎన్నికలు ముగిశాయి. అత్యధిక స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. కో ఆప్షన్ ఎన్నికతో ప్రక్రియ మొదలైంది. ఉదయం 10 గంటలకు కో ఆప్షన్ సభ్యుడి పదవి కోసం నామినేషన్లు స్వీకరించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామపత్రాల పరిశీలన, ఉపసంహరణ ముగిసిన అనంతరం ఎన్నిక చేపట్టారు. గడవు ముగిసిన తర్వాత నామపత్రాలు దాఖలు చేయడం వల్ల కొన్ని చోట్ల వాయిదా పడ్డాయి. మరి కొన్ని చోట్ల ఏకగ్రీవమయ్యాయి. కో ఆప్షన్ ఎన్నిక అనంతరం... మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియను చేపట్టారు.
ఘర్షణలు... వాయిదాలు... సంబురాలు
ఉద్రిక్తత, వాయిదాల మధ్య మండల పరిషత్ ఎన్నికలు ముగిశాయి. గెలిచిన వాళ్లు సంబురాల్లో ముగినిగిపోయారు. వాయిదా పడిన చోట రేపు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు.
mpp-elections
ఎంపీపీ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కోరం లేకపోవడంతో కొన్ని స్థానాల్లో ఎన్నికలు వాయిదా వేశారు. సమాన ఓట్లు వచ్చినప్పుడు లాటరీతో కొందరిని అదృష్టం వరించింది. తమ సభ్యులు ప్రలోభాలకు గురికాకుండా క్యాంపు రాజకీయాలు చేశారు. కొన్ని చోట్ల ఘర్షణకు దిగారు. చెదురుమదురు ఘటనలు మినహా మండల పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికలు వాయిదా పడిన చోట్ల మళ్లీ రేపు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఇచ్చినా... కుప్పకూలిన కాంగ్రెస్