తెలంగాణ

telangana

ETV Bharat / briefs

విజయసాయిరెడ్డి ట్వీట్ కు రామ్మోహన్ ఘాటు కౌంటర్... - తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు వార్తలు

తెలుగుదేశం పార్టీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తొలిసారి ఓ సంచలన ట్వీట్ చేశారు. తనపై వచ్చే విమర్శలకు ఇప్పటి వరకు పెద్దగా స్పందించని రామ్మోహన్... వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మాటకు మాట బదులిచ్చి తన సహనాన్ని పరీక్షించవద్దంటూ పరోక్షంగా హెచ్చరించారు.

విజయసాయిరెడ్డి ట్వీట్ కు రామ్మోహన్ ఘాటు కౌంటర్...
విజయసాయిరెడ్డి ట్వీట్ కు రామ్మోహన్ ఘాటు కౌంటర్...

By

Published : Jun 11, 2020, 6:03 PM IST

విజయసాయిరెడ్డి ట్వీట్ కు రామ్మోహన్ ఘాటు కౌంటర్...

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్​కు తెదేపా యువనేత రామ్మోహన్ నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాన్ని ఇరకాటంలోకి నెట్టాలని ప్రయత్నించిన విజయసాయిరెడ్డికి ఘాటుగా బదులిచ్చారు.

విజయసాయి ట్వీట్ ఇది...

రామ్మోహన్‌ నాయుడికి ముళ్ల కిరీటం తగిలించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోవాలని ప్రయత్నించి నవ్వుల పాలై... ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించేందుకు అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడని విమర్శించారు.

ముందు అవి మానండి…

విజయసాయిరెడ్డి ట్వీట్​కు తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు కౌంటర్ ట్వీట్ చేశారు. 'అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు. సీనియర్లు అందరూ చేతగాని వ్యక్తి పాలన చూసి ''ఛీ'' కొడుతున్నారు. కారు దించేశారనే కక్షతో మామ అప్రూవర్​గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టారు. ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు. ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించటం చేతకాలేదు. మూడు ముక్కలాట మొదలెట్టి మూతి ముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ, అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లేదు. దిల్లీలో కాళ్లు మొక్కడం, ట్విట్టర్​లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్​లో కృషి చేస్తే ప్రజలు హర్షిస్తారు విజయసాయిరెడ్డి గారు' అంటూ రామ్మోహన్ ఘాటుగానే జవాబిచ్చారు. జగన్‌, విజయసాయి రెడ్డిని మామాఅల్లుళ్లు అంటూ సంబోధించారు. విజయసాయి కుట్రలను రామ్మోహన్ ట్వీట్‌తో తిప్పికొట్టినట్టు అయిందని తెదేపా నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

ఇదీ చదవండి

'అప్పుడు ఉపన్యాసాలు దంచిన జగన్​.. ఇప్పుడు చేస్తున్నదేంటి?'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details