హోలీ సందర్భంగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఓ పిల్లికి పాలు పోస్తూ ఉన్న ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసి ఇలా రాసుకొచ్చాడు..
ఆసక్తికరంగా హోలీ సందేశమిచ్చిన మెగా హీరో - tollywood
హోలీ వేడుకలో ఉపయోగించే రంగులు జంతువులకు హాని కలిగిస్తాయని.. ప్లే గ్రీన్, ప్లే క్లీన్ అని అభిమానులకు సాయిధరమ్ తేజ్ సందేశమిచ్చాడు.
సాయి ధరమ్ తేజ్
"అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ పండుగని సంతోషంగా, సురక్షితంగా జరుపుకోండి. మీ చుట్టూ ఆనందాన్ని, ప్రేమను వెదజల్లండి. హోలీ రంగులు జంతువులకు హాని కలిగించవచ్చు. ప్లే గ్రీన్, ప్లే క్లీన్’’ అంటూ ట్వీట్ చేశాడీ యువహీరో.
ప్రస్తుతం చిత్రలహరి సినిమాలో నటిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. నివేదా పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.