సాంకేతిక సమస్యలు ఈసారి కూడా తప్పలేదు. ఈవీఎంల మొరాయింపులతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈవీఎంలు మొరాయించినందున పోలింగ్‌కు అంతరాయం కలిగింది. అధికారులు వేరే ఈవీఎంను తీసుకొచ్చి అమర్చారు. ఏడు గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ అరగంట ఆలస్యమైంది. ఉదయాన్నే ఓటు వేద్దామనుకున్నవారికి నిరాశే మిగిలింది.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో మాక్ పోలింగ్ ఆలస్యంగా జరిగింది. దేవరకద్రలోని 101వ పోలింగ్ కేంద్రంలోనూ సమయానికి ప్రారంభం కాలేదు. జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో మాక్ పోలింగ్‌లో ఈవీఎంలు మొరాయించాయి. రాయికల్ మండలం మూటపల్లిలో, నారాయణపేటలోని 126వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అరగంట పాటు నిలిచిపోయింది.
ఆసిఫాబాద్ లోని 182, 183, 185వ పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ 7గంటలకు ప్రారంభం కాలేదు.