లండన్‌లో హత్యకు గురైన నదీముద్దీన్ వ్యవహారంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. ఈ మేరకు ఆయన సుష్మాస్వరాజ్‌కు లేఖ రాశారు. నదీముద్దీన్ హత్య బాధాకరమన్న మహమూద్ అలీ... మృతుని భార్య గర్భవతి అని లేఖలో పేర్కొన్నారు. నదీముద్దీన్ భార్యకు అండగా ఉండేందుకు ఆమె తల్లి ఆయేషా సుల్తానా లండన్ వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఆయేషాకు వీసా త్వరగా ఇప్పించేలా చూడాలని కోరారు. లండన్ ఎంబసీతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.
అవసరమైన చర్యలు తీసుకోవాలి: హోంమంత్రి - SUSHMA SWARAJ
లండన్‌లో హైదరాబాద్‌కు చెందిన నదీముద్దీన్ హత్యకు గురి కావడం బాధాకరమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నదీముద్దీన్ మరణంపై తగు చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాశారు.
మహమూద్ అలీ