తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మోదీ రక్షించింది 15మంది ప్రయోజనాలనే: రాహుల్​ - BJP

గడిచిన ఐదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ కేవలం 15 మంది ప్రయోజనాలను మాత్రమే కాపాడారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.  రైతులు, పేదలను మోదీ అసలు పట్టించుకోలేదని ఉత్తరప్రదేశ్​లోని ఖేరీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.

మోదీ రక్షించింది 15మంది ప్రయోజనాలనే : రాహుల్​

By

Published : Apr 25, 2019, 6:36 AM IST

మోదీ రక్షించింది 15మంది ప్రయోజనాలనే : రాహుల్​

ప్రధాని నరేంద్ర మోదీ కేవలం 15 మంది ప్రయోజనాలను కాపాడి... రైతులు, పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైన మోదీ... ప్రస్తుత లోక్​సభ ఎన్నికల ప్రచారంలో వాటి ప్రస్తావనే తీసుకురావడం లేదని దుయ్యబట్టారు. ఉత్తరప్రదేశ్​లోని ఖేరీ, ఉన్నావ్​లో ఎన్నికల ర్యాలీలకు హాజరయ్యారు రాహుల్. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే న్యాయ్​ పథకం ద్వారా 5కోట్ల పేద కుటుంబాలకు ఏటా రూ.72వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఉద్ఘాటించారు. ఏడాది లోపే 22లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి గ్రామీణ యువతకు 10లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

"ఐదు సంవత్సరాల కిందట అచ్చేదిన్​ వస్తుందన్నారు. ఇప్పుడు చౌకీదార్​ చోర్​ అనే పరిస్థితి వచ్చింది. 2కోట్ల మంది యువతకు ఉద్యోగాలొచ్చాయా? లేదు. రూ.15లక్షలు అందాయా? లేదు. రైతులకు కనీస మద్దతు ధర? గత ఐదేళ్లలో నరేంద్ర మోదీ విద్య, ఆరోగ్య వ్యవస్థలకు నష్టం కలిగించారు. మొత్తం ప్రజాధనాన్ని 15 మందికి దోచి పెట్టారు'
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

మోదీ, ఆదిత్యనాథ్​పై సింధియా విమర్శలు

యువత, రైతుల పట్ల కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు పశ్చిమ యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా. రైతులకు కనీస మద్దతు ధర రెట్టింపు చేస్తామన్న మోదీ... దానిని సగానికి తగ్గించారని విమర్శించారు. గో రక్షణ పేరుతో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఇదీ చూడండి: రాహుల్​​ 'వయనాడ్' స్థానంలో​ పెరిగిన ఓటింగ్​

ABOUT THE AUTHOR

...view details