గత ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన భాజపా కేవలం 100రోజుల్లోనే 18వేల గ్రామాలకు కరెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి బంగారు శ్రుతి. నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. దేశ ప్రజల రక్షణ ఒక్క మోదీకే సాధ్యమవుతుందని కొనియాడారు. ప్రధాని చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి భాజపాను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
దేశ రక్షణ ఒక్క మోదీకే సాధ్యం: బంగారు శ్రుతి - klky
మరోసారి భాజపా అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి బంగారు శ్రుతి. కల్వకుర్తిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి బంగారు శ్రుతి