విపక్ష, అధికార పక్షాల మధ్య మాటల యుద్ధం. రానున్న ఎన్నికల్లో ఓటర్లపై ప్రభావం చూపిస్తుందని ఫిర్యాదులు. ఇవన్నీ ఓ సినిమా కోసం. ఈ అవాంతరాలు అన్నింటినీ అధిగమించి ఏప్రిల్ 11న విడుదలకు సిద్ధమైంది మోదీ బయోపిక్ 'పీఎం నరేంద్ర మోదీ'. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.
మోదీ .... ఛాయ్‌వాలా స్థాయి నుంచి భారతదేశ ప్రధానిగా ఎలా ఎదిగారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'మేరికోమ్' చిత్రంతో మెప్పించిన ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించాడు.